నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఆగస్ట్ 01: మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఆఫ్రికా దేశం కాంగో రిపబ్లిక్కు చెందిన **డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DAST)**తో అంతర్జాతీయ విద్యా సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా బోధన మరియు విద్యా పరమైన మార్గదర్శకత్వం, ఫలితాల ఆధారిత సిలబస్ తయారీ, కోర్సు మెటీరియల్ అభివృద్ధి, అధ్యాపకులకు శిక్షణ మరియు మార్గదర్శకత్వం వంటి విద్యా సేవలను మిట్స్ అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రతినిధులు మీవెల్ అర్జునన్ మరియు విగ్నేష్ అర్జునన్ మిట్స్ క్యాంపస్‌ను సందర్శించి, అకడమిక్ ప్రణాళిక, కరికులం రూపకల్పన, సిలబస్ తయారీ, అధ్యాపకుల మెంటరింగ్, విద్యా నాణ్యత మెరుగుదల వంటి అంశాలపై చర్చించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అవుట్‌కమ్ బేస్డ్ కరికులం, ఫలితాల ఆధారిత సిలబస్ రూపకల్పన, నాణ్యమైన కోర్సు మెటీరియల్ అభివృద్ధితో పాటు అకడమిక్ మెంటరింగ్ సేవలను అందించనున్నారు. ఈ ఒప్పంద పత్రాలపై విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీదేవి మరియు డేనియల్ అకాడమీ ప్రతినిధులు మీవెల్ అర్జునన్, విగ్నేష్ అర్జునన్ సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి. ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, .అడ్వైజర్ (ఆర్ & డి) డాక్టర్ తులసీరామ్ నాయుడు, డీన్-స్కూల్ అఫ్ కంప్యూటింగ్ డాక్టర్ చంద్ర ప్రకాష్ గుప్తా, విభాగాధిపతి డాక్టర్ ఎం. శ్రీదేవి, డాక్టర్ ఆర్. నిధ్య మరియు అధ్యాపకులు పాల్గొన్నారు
Reporter
Namitha News