Thursday, 30 July 2026 08:13:31 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు

కలెక్టరేట్ లో ఘనంగా దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి

Date : 23 March 2026 09:06 PM Views : 179

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 23 : సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన దొమ్మేటి వెంకటరెడ్డి మహనీయుని ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని పి.జి.ఆర్‌.ఎస్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, కె ఆర్ ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, సర్వే ఏడి భరత్ కుమార్ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఇంచార్జ్ తేజస్విని, జిల్లా అధికారులు,శెట్టి బలిజ సంఘ ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ దొమ్మేటి వెంకటరెడ్డి గారు సమాజ సేవకు అంకితభావంతో పనిచేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన జీవితం ప్రజలకు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సేవా భావం, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. 1905 బర్మా దేశంలోని ప్రవాస శెట్టిబలిజ సోదరులందరినీ సమీకరించి శెట్టిబలిజ సంక్షేమ సంఘంను స్థాపించారు. ఈ సంఘం ద్వారా బర్మా దేశంలో ప్రాథమిక పాఠశాలలు, గ్రంథాలయాలు, రాత్రి పాఠశాలలు నెలకొల్పి వయోజన విద్యాబోధనకు ఆనాడే ఆయన జాతకత మహాత్మా గాంధీ కంటే ముందుగానే అంకురార్పణ చేశారని, ఇది విద్యా ప్రాధాన్యత పట్ల ఆయనకు ఉన్న దూరదృష్టం అని తెలియజేశారు.ఆయన ఆలోచనలు, విలువలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. శెట్టిబలిజ కుల సంఘ నాయకులు బాలాజీ మాట్లాడుతూ..అక్షరాస్యత లేక, వివక్షల మధ్య జీవించిన శెట్టిబలిజ సమాజానికి విద్యా ప్రాముఖ్యతను తెలియజేసి సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అనంతరం శెట్టిబలిజ కుల సంఘ నాయకులు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గారికి శాలువాతో ఘనంగా సన్మానించారు

ఈ కార్యక్రమంలో శెట్టి బలిజ సంఘ నాయకులు,జిల్లా అధికారులు,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :