Friday, 31 July 2026 08:50:50 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

లింగ సమానత్వంపై ప్రజలకు అవగాహన కల్పించాలి

అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా

Date : 25 November 2025 08:08 PM Views : 205

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : లింగ సమానత్వంపై ప్రజలకు అవగాహన కల్పించాలి - అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా - ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పోస్టర్లు ఆవిష్కరణ - హాజరైన డిఆర్డిఏ పిడి నాగేశ్వరరావు వెల్లడి మదనపల్లె : లింగ వివక్షపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి బాలికలపై సదాభిప్రాయాన్ని పెంపొందించడంలో మహిళా సమఖ్యా గ్రూప్ సభ్యులు ప్రత్యేక దృష్టిపెట్టాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు.మంగళవారం స్థానిక మదనపల్లి మహిళా మండల సమాఖ్య కార్యాలయంలో లింగ వివక్ష నిర్మూలన దినోత్సవంపై సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మదనపల్లి మండల ఏపీఎం కిజర్ ఖాన్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ భాష,డిఆర్డిఎ పిడి నాగేశ్వరరావు,డిపిఎం ధర్మరాజు,సిడిపిఓ నాగవేణి,సూపర్వైజర్లు శ్వేత,,కళావతి,రామసముద్రం ఏపిఎం శివ,నిమ్మనపల్లి ఏపీఎం మురళి,వివో లీడర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ మహిళా సమఖ్యా గ్రూప్ సభ్యులు రుణాలు తీసుకోవడంతో పాటు,బాధ్యతగా తిరిగి చెల్లించాలని స్పష్టం చేశారు.ఏదైనా అవసరాల కోసం బ్యాంకుల్లో రుణము తీసుకోవాలంటే అనేక షరతులకు లోబడి రుణం పొందాల్సి ఉంటుందని అయితే మహిళలకు ప్రభుత్వం ఆంక్షలు లేకుండా రుణాలు అందిస్తోందని వీటిని సద్వినియోగం చేసుకుని సకాలంలో తిరిగి చెల్లించి మహిళా సంఘాలు బలోపేతమయ్యే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు.స్థలాలు,ఇండ్లు లేని వారు దరఖాస్తు పెట్టుకుంటే అందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అభివృద్ధి పథంలో తీసుకు వెళ్ళడానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని మహిళా సమఖ్యా గ్రూపు లీడర్లు,సభ్యులు సద్వినియోగం చేసుకొవాలని తెలిపారు.తద్వారా విద్యుత్ బిల్లులు చెల్లింపు బాధలకు ఉండవనన్నారు.అనంతరం పీడీ నాగేశ్వరరావు మాట్లాడుతూ మదనపల్లెలో లింగ వివక్ష దినోత్సవంపై ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి,అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి ప్రజల్లో అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఇప్పటికీ సమాజంలో లింగ వివక్షత జరుగుతోందని తద్వారా మహిళలు బాలికలు వివక్షకు గురవుతున్న సందర్భాలు నిత్యం జరుగుతున్నాయని చెప్పారు.వీటిని దూరం చేసే సదుద్దేశంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చిందన్నారు.ముఖ్యంగా స్త్రీ,పురుషుల మధ్య బాలికల బాల్య వివాహాలు,పిల్లలు చదువుల విషయంలో మార్పు తీసుకు రావడమే ముఖ్య ఉద్దేశ్యమన్నారు.ఈ కార్యక్రమంలో జాఫరున్నీ షా,వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు,మహిళా సమఖ్య సభ్యులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :