Thursday, 30 July 2026 10:39:19 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఎంపీల్ ఫ్రెండ్స్ మీట్

మిట్స్ విజయ భాస్కర్ చౌదరి ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ మీట్

Date : 26 January 2026 05:13 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 26 : మదనపల్లె ను జిల్లా కేంద్రం గా చారిత్రాత్మక గుర్తింపు పొందిన సందర్భంగా మదనపల్లె ఫ్రెండ్స్ మీట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ హై స్కూల్, జి.ఆర్.టి హై స్కూల్ మదనపల్లె లోని అల్యూమిని విద్యార్థులు భాగస్వామి గా నిలబడి మీట్ ను ఏర్పాటుచేసినారు. ఈ ముఖ్యమైన ప్రయాణంలో భాగమైన స్నేహితులు, శ్రేయోభిలాషులు ఒకచోట చేర్చడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం అని నారాయణ స్వామి అన్నారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఒక చారిత్రాత్మక మైలురాయి అని అన్నారు. 5 నియోజకవర్గాలతో కొత్త జిల్లా పరిపాలన జనవరి 1, 2026 నుండి ప్రారంభం అవడం, పరిపాలన ప్రారంభం ఇక్కడ జరగడము ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమం లో మిట్స్ (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఫౌండర్ మరియు ఛాన్సుల్లేర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరీ మాట్లాడుతూ తమ స్నేహితులు ఎంతో మంది ఈ కార్యక్రమం లో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఒక్కపుడు మదనపల్లె నందు డాక్టర్ డిగ్రీ చేసిన వారు అతి తక్కువుగా ఉండేవారు, అలాంటిది ఇప్పుడు దేశం లో ఉన్న ప్రతి రాష్ట్రం నుంచి తమ యూనివర్సిటీ నందు 259 మంది పీ హెచ్ డి పట్టభద్రులు కలిగిన యూనివర్సిటీ గా మిట్స్ ఎదగడం, మదనపల్లె పేరు తో మిట్స్ ఉండటం ఎంతో గర్వము గా ఉందని, అల్లాంటి మదనపల్లె ను ఈ రోజు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లెను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, మదనపల్లె కు దక్కిన గౌరవం మరువలేనిది అని అన్నారు. ఎంతో మంది ఈ మదనపల్లె జిల్లా అవడం కోసం కృషిచేశారని, తమ వంతుగా జిల్లా అభివృద్ధికి ఎటువంటి సహాయానికైనను వెనకాడబోమని తెలియజేస్తున్నామని, మిట్స్ (మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్) డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ఎప్పుడు ముందుటుందని అన్నారు. ఈ సందర్భాంగా ఎంతో మంది తమ మిత్రులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమం లో నాదెళ్ల ద్వారకానాథ్, చక్రపాణి, యూ. విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: