Friday, 31 July 2026 07:36:44 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

రైతులకు ప్రభుత్వమే పంటల బీమా చెల్లించాలి

పి.పి.పి. విధాన రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కళాశాలలు నిర్వహించాలి

Date : 18 November 2025 08:54 PM Views : 174

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రైతులకు ప్రభుత్వమే పంటల బీమా చెల్లించాలి -- నిర్వీర్యం అవుతున్న ఆరోగ్య శ్రీ -- పిపిపి విధాన రద్దు చేసి ప్రభుత్వమే మెడికల్ కళాశాలలు నిర్వహించాలి -- మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ డిమాండ్ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి చూపిన బాటలో రైతులకు గత వైసిపి ప్రభుత్వమే పంటల బీమా చెల్లించిన విధంగా నేటి కూటమి ప్రభుత్వం కూడా చెల్లించి వుంటే లక్షలాది మంది రైతాంగానికి న్యాయం జరిగి వుండేదని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ పేర్కొన్నారు. మంగళవారం మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం నిమ్మనపల్లె, ముష్ఠురు, తవలం, వెంగంవారిపల్లి, అగ్రహారం, సామకోటవారిపల్లి గ్రామ పంచాయతీలలో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నియోజకవర్గ పరిశీలకులు అనూషా రెడ్డి విచ్చేశారు. ‌ఈ సందర్భంగా నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అనాలోచితంగా ఆలోచించి రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద కక్షతో రైతాంగానికి ఎంతో ఉపయుక్తంగా ఉండే ఉచిత పంట బీమా రద్దు చేసిందన్నారు. ప్రభుత్వమే రైతుల పక్షాన పంటల బీమా చెల్లించే పధకం కూటమి ప్రభుత్వం కొనసాగించి వుంటే నేడు పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగి వుండేదని వివరించారు. ఇప్పటికైనా ప్రభుత్వ రైతాంగానికి పంటల బీమా చెల్లింపుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‌అదేవిధంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ పధకం నేడు నిర్వీర్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‌నెట్ వర్క్ ఆసుపత్రులకు గ్రాంట్ చెల్లింపు సక్రమంగా లేక చాలా ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ నిరాకరించి పేదలకు వైద్య అందించడం లేదన్నారు.‌ వైద్య కళాశాలు పిపిపి విధానంలో కాకుండా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. పేదలకు వైద్యం అందించే మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో ఆధునిక యంత్ర పరికరాలు గుంటూరుకు తరలింపు సమంజసం కాదని అన్నారు.‌ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అనూషా రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వి.ఎస్. రెడ్డి, రెడ్డిశేఖర్ రెడ్డి, ఆర్.ఐ. రమణారెడ్డి, శశిధర్ రెడ్డి, నవాజ్, వేణుగోపాల్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి, చండ్రాయుడు, దామోధర్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, రఫీ, నూర్ మొహిద్దీన్ ఖాన్, ఖాదర్ బాషా, హేమంత్, నాగరాజ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :