నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి అని సీఎం కి వినతి .....తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు విశాలాంధ్ర, మదనపల్లి: జిల్లా కేంద్రంగా ఏర్పడిన మదనపల్లె పట్టణాన్ని అన్ని రంగాల్లో సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలని కోరుతూ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. విజయవాడలోని సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి మదనపల్లె అభివృద్ధికి అవసరమైన పలు ప్రతిపాదనలను వివరించారు. ముఖ్యంగా పట్టణంలో రోడ్ల అనుసంధానం మెరుగుపరచడం, ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం, విద్య, వైద్య రంగాలను మరింత అభివృద్ధి చేయడం, ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్‌గా పేరుగాంచిన మదనపల్లె టమోటా మార్కెట్‌ను ఆధునికీకరించడం, రోడ్లు–భవనాల శాఖ పరిధిలో మౌలిక సదుపాయాలను విస్తరించడం, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. మదనపల్లె జిల్లా కేంద్రంగా మరింత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని శ్రీరామ్ చినబాబు విజ్ఞప్తి చేశారు.
Reporter
Namitha News