Friday, 31 July 2026 03:52:25 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

విద్యాశాఖ నిర్ణయం ప్రైవేట్ పాఠశాలలకి ఇబ్బందికరం

హైకోర్టు ఆదేశాలను ధిక్కరించడం సబబు కాదు - ఎంఈఓకి పలువురు కరస్పాండెంట్ల వినతి

Date : 14 May 2026 03:00 PM Views : 119

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విద్యాశాఖ నిర్ణయం ప్రైవేట్ పాఠశాలలకి ఇబ్బందికరం - హైకోర్టు ఆదేశాలను ధిక్కరించడం సబబు కాదు - ఎంఈఓకి పలువురు కరస్పాండెంట్ల వినతి మదనపల్లె : ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఆయా పాఠశాలల కరస్పాండెంట్ల ప్రమేయం లేకుండా యుడైస్ నందు తొలగించడం,టీసిలు మంజూరు చేయాలనడం వంటి విద్యాశాఖ నిర్ణయాలు ప్రైవేటు పాఠశాలలకు తీవ్రం నష్టం కలిగిస్తాయని విద్యోదయ కరస్పాండంట్ శ్రీనివాసులు నాయుడు,న్యూ లిటిల్ ఫ్లవర్ రామకృష్ణ రెడ్డి,సాయి విద్యానికేతన్ శ్రీనివాసరావు,బ్రహ్మర్షి,కేశవ రెడ్డి,ఎస్విఎల్ ప్రవీణ్,డైమండ్ చక్రపాణి,విజేత శ్రీనివాస శర్మలు పేర్కొన్నారు.ఈ మేరకు గురువారం మండల విద్యాశాఖ అధికారి ఎం.ప్రభాకర్ రెడ్డికి వారు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సుప్రీం కోర్టు ఏదైనా విద్యార్థి ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలకు మారాలంటే,బ్యాలెన్స్ ఉన్న ఫీజులో కనీసం 50 శాతం చెల్లించి టీసీలు తీసుకోవాలని మరియు మిగతా బ్యాలెన్స్ మొత్తాన్ని ఆరు విడతలలో చెల్లించాలని తీర్పు ఇచ్చిందన్నారు.అనంతరం ఆయా కరెస్పాండెంట్ల అనుమతితో విద్యార్థి చేరే ప్రభుత్వ/ప్రవేటు పాఠశాలల చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు.అయితే ప్రస్తుతం విద్యాశాఖ ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే కరస్పాండెంట్ల అనుమతి అవసరం లేదంటూ ఆదేశాలు జారీ చేయడం అభ్యంతరకరమన్నారు.ఇటువంటి నిర్ణయాలు ప్రైవేట్ పాఠశాలల మనుగడకు ప్రమాదకరమన్నారు.ఈ నిర్ణయంపై మండల విద్యాశాఖ,జిల్లా విద్యాశాఖ అధికారులు పునరాలోచించాలని,తమ విజ్ఞప్తిని రాష్ట్ర విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.ఈ అంశాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్,ఉన్నత విద్యాశాఖ అధికారులు దృష్టికి తీసుకెళ్లి ప్రైవేటు పాఠశాలలకు ఇబ్బంది లేకుండా చూస్తామని ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: