Thursday, 30 July 2026 10:54:18 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రకృతి వ్యవసాయం మే మానవాళికి మనుగడ - జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ నారాయణ

Date : 20 May 2026 09:04 PM Views : 101

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 20 : ప్రకృతి వ్యవసాయంలో జీవన ఎరువులు, కషాయాలతో పండించిన పంటలతో మానవాళికి ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని జిల్లా వ్యవసాయాధికారి శివ నారాయణ తెలిపారు. బుధవారం ఆయన తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీలలోని ప్రకృతి వ్యవసాయ పంటల క్షేత్రాలను పరిశీలించారు. ప్రతి రైతు రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయం తో భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందన్నారు. తంబళ్లపల్లె, పరసతోపు పంచాయతీలలోని వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా కూరగాయలు, ఆకుకూరలు, వరి, మొక్కజొన్న, వేరుశనగ, మిశ్రమ పంటలు వేసిన విధానాన్ని చూసి వారిని అభినందించారు. మండలంలో ప్రకృతి వ్యవసాయం అవగాహనలో ఏపీ ఎల్ ఎన్ ఎఫ్ సిబ్బంది పనితీరు అను ప్రశంసించారు. మండలంలో గుండ్లపల్లి పంచాయతీ లో ప్రకృతి వ్యవసాయం తో పండిన పంటలు అదేవిధంగా మోడల్ స్కూల్లో విద్యార్థులు ప్రకృతి వ్యవసాయంతో పండించిన కూరగాయ పంటల పై ఆరా తీశారు. భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయమే పరమావధిగా రైతు భావించేలా వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఏవో రమణ కుమార్, ఏఈఓ సురేష్, ఏపీ ఎన్ ఎల్ ఎఫ్ సభ్యులు, ప్రకృతి వ్యవసాయ రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: