నమిత న్యూస్ - Andhra Pradesh / అనంతపురం : అనంతపురం - జూన్ 19 : అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఒక వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఆలయ హుండీ కానుకలను అధికారులు లెక్కిస్తుండగా ఓ రూ.20 నోటుపై రాసి ఉన్న వినతి అందరినీ ఆశ్చర్యపరిచింది. "స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, ఆమె త్వరగా చనిపోయేలా చూడు" అని ఆ నోటుపై రాసి ఉంది. అత్త వేధింపులు భరించలేక సదరు కోడలు దేవుడికి ఇలా విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. ఈ వింత కోరికను చూసి అధికారులు, భక్తులు ముక్కున వేలేసుకున్నారు. మరో నోటుపై ఆంగ్లంలోనూ రాసి హుండీలో వేశారు. ప్రస్తుతం ఈ నోట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది
Reporter
Namitha News