నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - డిసెంబర్ 06 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు విద్యుత్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ఘన నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భానునాయక్, ADE చిన్న స్వామి నాయక్ కార్యాలయ ఏఈలు విద్యుత్ కార్యాలయ సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవల గురించి కీర్తిస్తూ భారతదేశ రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాలకు సమ న్యాయం అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.
Reporter
Namitha News