Friday, 31 July 2026 10:40:58 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

పుంగనూరు నియోజకవర్గానికి 1,442 గృహాల మంజూరు..

Date : 23 June 2026 09:12 PM Views : 99

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : ఆగస్టు 15లోగా మంజూరైన గృహాల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్న హౌసింగ్ పీడీ రమేష్‌రెడ్డి.. పుంగనూరు నియోజకవర్గానికి 1,442 గృహాలు మంజూరయ్యాయని వెల్లడించారు. అన్నమయ్య జిల్లా,పుంగనూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 4,336 మందిని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గుర్తించి నమోదు చేసినట్లు చెప్పారు.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులైన వారందరికీ గృహాలు మంజూరు అయ్యేలా చర్యలు చేపడుతున్నామన్నారు.పుంగనూరు లో ఇంటి స్థలాలు లేని 580 మందిని గుర్తించి నమోదు చేశామని, వారికి తదుపరి దశలో అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు.పట్టణ ప్రాంతాల్లో స్థలం కలిగిన అర్హులకు రూ.2.50 లక్షల వ్యయంతో గృహాలు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.అర్బన్ ప్రాంతాల్లో సరైన పత్రాలు ఉన్న లబ్ధిదారులకు గృహాల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందన్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 4,339 మంది లబ్ధిదారుల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు.గృహాలు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు.సమావేశంలో హౌసింగ్ డీఈ దీనదయాళ్‌రాజు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :