నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 30 ః నాటి వైకాపా ప్రభుత్వం చెత్త పై పన్ను వేస్తే ప్రజలు బుద్ధి చెప్పారని, అదే చెత్తను మా కూటమి ప్రభుత్వం సంపదగా సృష్టించి స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర వైపు పరుగులు పెడుతుందని మండల టిడిపి అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి కొనియాడారు. శనివారం మండలానికి మూడు బ్యాటరీ చెత్త సేకరణ వాహనాలకు మహిళా నాయకురాలు సిద్ధమ్మ పూజలు నిర్వహించగా ఏవో థామస్ రాజా, కార్యదర్శి శ్రీనివాసరావు లు లాంఛనంగా ప్రారంభించారు. మండలంలోని తంబళ్లపల్లె, కోసువారిపల్లె, రేణుమాకులపల్లి లకు బ్యాటరీ వాహనాల ద్వారా తడి పొడి చెత్త సేకరణకు ఈ బ్యాటరీ వాహనాలు ఉపయోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఈ వినోద్ కుమార్, క్లస్టర్ ఇంచార్జ్ శ్రీనివాసులు, రైతు సంఘం నాయకుడు వెంకట్ రెడ్డి, పురుషోత్తం, వీరాంజనేయులు, మాజీ జెడ్పిటిసి రామచంద్ర, తెలుగు యువత నరసింహులు, ఎర్రసానిపల్లి రామచంద్రారెడ్డి, బీసీ నాయకుడు సుధాకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు బాబ్జాన్, సురేంద్ర, రామకృష్ణ, అల్లావుద్దీన్, బిజెపి హరినాథ్ రెడ్డి, గాలి మల్లయ్య,ఏ పీ ఓ అంజనప్ప, కార్యాలయ సిబ్బంది సురేంద్ర, విజయ్, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్,ఖయ్యూం, నాగరాజు, పంచాయితీ పద్మావతి, భాస్కర్, డ్రైవర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News