Thursday, 30 July 2026 04:17:39 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి

Date : 20 July 2026 03:42 PM Views : 104

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాష్ట్రంలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "తల్లికి వందనం" పథకంతో పాటు అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) అన్నమయ్య జిల్లా కార్యదర్శి దేవా, ఏఐటీయూసీ మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా మదనపల్లి మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు మస్తాన్ మాట్లాడుతూ డైలీ వెజ్ కార్మికులకు ఐదు నెలల పది రోజులు జీతాలు చెల్లించలేదు అధికారులు నిర్లక్ష్యం వల్ల కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు జీతాలు లేనందువలన 53 మంది కార్మికులు ఉండగా జీతాలు లేనందున 30 మంది కార్మికులు పనిచేస్తున్నారు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఎండా-వానా, పండుగలు అనే తేడా లేకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని వారు పేర్కొన్నారు. అయినప్పటికీ అధిక శాతం మంది కార్మికులు తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల పిల్లల విద్య, కుటుంబ సంక్షేమం, జీవన భద్రతను దృష్టిలో ఉంచుకుని "తల్లికి వందనం" పథకాన్ని అర్హులైన ప్రతి మున్సిపల్ కార్మిక కుటుంబానికి వర్తింపజేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల ప్రయోజనాలు వారికి అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పథకాల అమలులో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనా సమస్యలను వెంటనే పరిష్కరించాలని, మున్సిపల్ కార్మికుల కోసం ప్రత్యేక నమోదు, అవగాహన శిబిరాలు నిర్వహించి అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రభుత్వం గుర్తించి వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విషయంలో జిల్లా పరిపాలన తక్షణ చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యస్. మస్తాన్ బి.తిరుమలప్ప జానకి లోకేష్ మళ్లీ అల్లా బక్షు శివ తదిరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :