నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 22 : రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబును తంబళ్లపల్లె మండల టిడిపి నాయకులు సోమవారం ఘనంగా సన్మానించారు. రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, టిడిపి రాష్ట్ర బీసీ ఉపాధ్యక్షుడు నాయుడుల ఆధ్వర్యంలో ప్రసాద్ బాబును పూలమాలలు దృశ్యాలవులతో సన్మానించి వెంకటేశ్వర స్వామి మెమెంటో అందజేశారు. ఈ సందర్భంగా మండలంలో తెలుగుదేశం పార్టీ దుస్థితిపై కూలంకషంగా వివరించి పార్టీని గాడిలో పెట్టి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి సహకరించాలని కోరారు. దీనిపై ప్రసాద్ బాబు స్పందించి తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో టిడిపి బలంగా ఉందని ఐకమత్యంతో పార్టీని ముందుకు నడిపి ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వారి వెంట మీసాల భాస్కర్ నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షులు మదనమోహన్, జైపాల్ నాయుడు,నాగేంద్ర నాయుడు,జగదీష్, భాస్కర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News