నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డీఎస్సీ-2025 మెరిట్ లిస్ట్, కేటగిరీ వారీ కటాఫ్ మార్కులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మదనపల్లె కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. డీఎస్సీ బాధిత అభ్యర్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యుగంధర్ అబ్బవరం మాట్లాడుతూ ఫలితాల ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని, అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు మెరిట్ లిస్ట్, కటాఫ్ మార్కులు ప్రకటించాలని కోరారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు
Reporter
Namitha News