Monday, 03 August 2026 06:45:59 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

కార్పొరేట్ సేల్స్ పై డిజిటల్ యుగంలో స్మార్ట్ చెక్ నిర్మాణం, అభివృద్ధి పై ఉపన్యాసం

ముఖ్య అతిథిగా హైదరాబాద్ కు చెందిన స్మార్ట్‌చెక్ సంస్థ వ్యవస్థాపకుడు & సీఈఓ శ్రీనివాస్ తేజ మడాల

Date : 22 April 2026 08:30 PM Views : 148

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 22 : మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు స్కూల్ అఫ్ మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో “కార్పొరేట్ సేల్స్ లీడర్ నుండి వ్యాపారవేత్త వరకు: డిజిటల్ యుగంలో స్మార్ట్ చెక్ నిర్మాణం మరియు అభివృద్ధి” అనే అంశంపై అతిధి ఉపన్యాస కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్మార్ట్‌చెక్ సంస్థ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ శ్రీనివాస్ తేజ మడాల, హైదరాబాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మార్కెట్ అవగాహన, కస్టమర్ అవసరాలపై దృష్టి మరియు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం వ్యాపారం విజయానికి చాలా ముఖ్యమని తెలిపారు. డిజిటల్ యుగంలో వ్యాపార నిర్మాణం, ముఖ్యంగా సాఫ్ట్వేర్ మోడల్ ప్రాముఖ్యతను వివరించడంతో పాటు, “స్మార్ట్ చెక్” అనే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఎలా ఆలోచన దశ నుంచి విజయవంతమైన సంస్థగా అభివృద్ధి చేశారో ఉదాహరణలతో వివరించారు. స్టార్టప్ ప్రారంభ దశలో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలు, అలాగే నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని తెలియజేశారు. ప్రస్తుత ప్రపంచంలో విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, కొత్త ఆలోచనలను వ్యాపార అవకాశాలుగా మార్చి పరిశ్రమలను అభివృద్ధి చేసే పారిశ్రామిక వేత్తలుగా ఎదగడం అత్యంత అవసరం అని అన్నారు. సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణాత్మక దృక్పథం, రిస్క్ తీసుకునే ధైర్యం మరియు సరైన ప్రణాళిక ద్వారా యువత దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించగలదని సూచించారు. ఒక ఆలోచనను విజయవంతమైన ఉత్పత్తి లేదా సేవగా మార్చే ప్రక్రియలో దృష్టి, వ్యూహం, పట్టుదల, పరిశ్రమలతో కోలాబరేషన్ వంటి అంశాలు అత్యంత ముఖ్యమని వివరించారు. అలాగే పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పథకాల ద్వారా స్టార్ట్-అప్‌లు, ఇన్నోవేషన్ ప్రాజెక్టులు, మరియు యువ పారిశ్రామిక వేత్తలకు అవసరమైన ఆర్థిక సహాయం, మెంటరింగ్ మరియు బిజినెస్ డెవలప్మెంట్ సపోర్ట్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విద్యార్థులలో ఉన్న ఆలోచనలను వాస్తవికతగా మార్చి కొత్త స్టార్ట్-అప్‌లుగా అభివృద్ధి చేయడమే భవిష్యత్తులో అత్యుత్తమ కెరీర్ అవకాశమని, ఈ ప్రయాణం సమాజ అభివృద్ధి మరియు దేశ పురోగతికి దోహదం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్-స్కూల్ అఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి, కోఆర్డినేటర్ డాక్టర్ జ్ఞాన ప్రసూన, బి.శ్రీకాంత్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :