Thursday, 30 July 2026 11:56:18 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లి సర్వజన ఆస్పత్రి లో రోగుల అటెండర్లకు చలి కి ఆరు బయటే నరకం చూస్తున్నారు

Date : 11 November 2025 07:30 AM Views : 281

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 11 : అన్నమయ్య జిల్లా లోని మదనపల్లి సర్వజన ఆసుపత్రి కి చికిత్సల కోసం వచ్చే రోగులకు, వారి అటెండర్లకు నరకం తప్పడం లేదు. రోగులు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందుకు పడుతుంటే మరో వైపు వారివెంట అటెండర్లు గా వచ్చిన కుటుంబీకులను రాత్రి పూట లోపలికి అనుమతించక పోవడంతో వారు ఆస్పత్రి ఆవరణలో ఉన్న చెట్ల నీడన చలికి వణుకుతూ దుప్పట్లు కప్పుకుని కాలయాపన చేయాల్సిన పరిస్థితి సోమవారం రాత్రి నెలకొంది. డివిజన్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగుల అటెండర్లు, దోమ కాట్లు, వణికించే చలితో ఆస్పత్రి బయట జాగారం చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో వరండాలు, ఆస్పత్రి పైభాగంలో వెయ్యి మంది ఒకేసారి ఉండే అంత సౌకర్యాలు ఉన్నా కూడా లోనికి అనుమతించకపోవడంతో తీవ్ర కష్టాలు పడుతున్నట్లు మండిపడుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో జరుగుతున్న అన్యాయాలపై జిల్లాస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతోనే తమకు ఈ కష్టాలు వచ్చాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి లోపల వరండాలు లేక గదులలో పడుకోవడానికి అనుమతించకపోతే తాము ఎక్కడ పడుకోవాలని, ఆస్పత్రి బయట చలిలో ఉంటే పొరపాటున చలికి చనిపోతే ఎవరు బాధ్యులు చెప్పాలని మండిపడ్డారు. ఏదైనా జరగరానిది జరిగితే ఆసుపత్రి సిబ్బంది సూపరిండెంట్ మరియు ఆర్ఎంవో లే బాద్యులని ఆస్పత్రి బయట రోగుల అటెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల కష్టాలను జిల్లా స్థాయి అధికారులూ పట్టించుకోక పోవడంతోనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పేదల వైద్యం గాడి తప్పుతోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :