Monday, 03 August 2026 06:45:05 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

మైసూరులో చైతన్య సేవా సంస్థ వ్యవస్థాపకుడికి ఘన సత్కారం

Date : 22 April 2026 08:47 PM Views : 157

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మైసూరులో చైతన్య సేవా సంస్థ వ్యవస్థాపకుడికి ఘన సత్కారం మత సామరస్యానికి సేవలకుగాను ఎంపీ ఆనందన్‌కు యు ఆర్ ఐ అవార్డు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఇంటర్నేషనల్ యూత్ హాస్టల్‌లో నిర్వహించిన యునైటెడ్ రిలిజియన్స్ ఇనిషియేటివ్ (యు ఆర్ ఐ) దక్షిణ భారత రాష్ట్రాల కోఆపరేటివ్ సర్కిల్స్ విస్తృత సమావేశంలో అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణానికి చెందిన చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్‌కు ప్రత్యేక అవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. మతాంతర సౌహార్దం, శాంతి, న్యాయం మరియు సామాజిక సమగ్రత కోసం ఆయన చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించి (యు ఆర్ ఐ ) దక్షిణ భారత నాయకత్వం ఈ గౌరవాన్ని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా పలువురు సామాజికవేత్తలు, సంఘసంస్కర్తలు ఎంపీ ఆనందన్ సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రపంచ శాంతి స్థాపనలో యు ఆర్ ఐ 109 దేశాల్లో పనిచేస్తోందని, కుల మతాలకు అతీతంగా ప్రతి మనిషిని సమానంగా గౌరవించడం అవసరమని తెలిపారు. ప్రతి మతం మానవత్వాన్ని బోధిస్తుందని, మానవసేవే మాధవసేవ అని పేర్కొంటూ సమాజంలో మానవీయ విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో దక్షిణ భారత రాష్ట్రాల నుంచి వచ్చిన కోఆపరేటివ్ సర్కిల్స్ ప్రతినిధులు పాల్గొని మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సత్కారం అందుకున్న వి.ఎస్. రెడ్డి మాట్లాడుతూ ఈ గౌరవం తనకే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో మత సామరస్యానికి కృషి చేస్తున్న అందరికీ దక్కినదేనని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా శాంతి, న్యాయం, మానవ విలువల పరిరక్షణ కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా స్టేట్ కోఆర్డినేటర్ వి.ఎస్. రెడ్డి, ఆసియా కోఆర్డినేటర్ డాక్టర్ అబ్రహం కారికమ్, కర్ణాటక స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ వర్షా, మత్తయి కుట్టి తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: