Saturday, 18 April 2026 03:45:30 PM
# జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్ # తంబళ్లపల్లె లో ఫ్లెక్సీ ల గొడవ - ధర్నా - ఉద్రిక్తత # ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం # దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ # మిట్స్‌లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం # నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో చెరువుల నింపుదలపై దృష్టి జలధార–జలహారతి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు # గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది # కురబల అభివృద్ధికి సమగ్ర కృషి # 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ # 13వేల రూ లంచం తీసుకొంటూ ఏసిబి పట్టుబడిన అబ్దుల్ రజాక్ # ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు # ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి # మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు

Date : 17 April 2026 12:18 PM Views : 16

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - ఏప్రిల్ 17 : ఆత్మకూరు ప్రియదర్శిని కళాశాల ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో భారీ ప్రభంజనం సృష్టించింది.. 45 వరకు రాష్ట్ర జిల్లా స్థాయి ర్యాంకుల సాధించడం గొప్ప విశేషం.. ఇంటర్మీడియట్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరంలో వచ్చిన ఫలితాలలో జిల్లాలోని అత్యధిక ర్యాంకులు సాధించడం ఈ ఏడాది ప్రత్యేకత.. జిల్లా స్థాయిలో మొదటి మూడు ర్యాంకులు రాష్ట్రస్థాయిలో ఐదు ర్యాంకులు సాధించి ఆత్మకూరు చరిత్రలోనే గొప్ప ప్రభంజనంగా ప్రియదర్శిని కళాశాల ఈ ఏడాది నిలవడం విశేషం.. ఈ క్రమంలో జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.. తమ బిడ్డలకు మంచి విద్యను అందించి జిల్లా ర్యాంకులు సాధించడంలో సహకరించిన అధ్యాపక బృందానికి కళాశాల యాజమాన్యానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందన ధన్యవాదాలు తెలిపారు.. ప్రియదర్శిని కాలేజీలో తమకు అందించిన ఉత్తమ బోధనతోనే తాము మంచి ర్యాంకులతో పాస్ కావడానికి కారణమని అందుకు ఉపాధ్యాయులకు కాలేజ్ యాజమాన్యానికి రుణపడి ఉంటామని విద్యార్థులు తెలిపారు.. ఆత్మకూరు పట్టణంలో ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించి అత్యధిక పాస్ శాతం పొందడం సంతోషంగా ఉందని కాలేజీ కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు రెడ్డి మరియు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు తినిపించి బొకేతో సత్కరిస్తూ అభినందనలు తెలిపారు. ప్రిన్సిపాల్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ 670 మంది విద్యార్థులతో అత్యధిక శాతం ఇంటర్మీడియట్ విద్యార్థులు కలిగిన కళాశాల తమదేనని గత ఏడాది రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకుతో పాటు ఈ ఏడాది మొదటి మూడు ర్యాంకులు మరియు అత్యధిక ర్యాంకులు సాధించడం ఎంతో సంతోషకరమని తమ విద్యా బోధన క్రమశిక్షణతో తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును తమ చేతిలో పెడుతున్నారని అందుకే తాము తమ సిబ్బంది ఎంతో కృషిచేసి మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :