Friday, 31 July 2026 07:38:36 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మల్లయ్య కొండల మైనింగ్ మానవాళికి పెనుముప్పు - బాలల హక్కుల ప్రజాధ్వని రాష్ట్ర అధ్యక్షురాలు జల్లా లలితమ్మ

Date : 29 May 2026 08:48 PM Views : 125

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 29 ః లక్షలాదిమంది భక్తుల ఆరాధ్య దైవం ముక్కంటి నిలయాలుగా నిలిచిన తంబళ్లపల్లె (సాధు, ఇనుము, మల్లయ్య) మల్లయ్య కొండల్లో మైనింగ్ చేపడితే లక్షలాది జీవరాశులు, మూగజీవాలు, వేలాదిమంది అటవీ శివార్ల ప్రజలు జీవనోపాధి కోల్పోవడంతో పాటు భవిష్యత్తులో పర్యావరణం కాలుష్యమై మానవాళికి పెనుముప్పు ఏర్పడుతుందని బాలల హక్కుల ప్రజా ధ్వని రాష్ట్ర అధ్యక్షురాలు జల్లా లలితమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాక్షాత్తు ఆ మహా శివుడు సాదుకొండ నుండి సొరంగ మార్గంలో ఇనుము కొండ ద్వారా మల్లయ్య కొండ చేరి స్థిరపడినట్లు పురాణాలు చెబుతున్నాయని దీంతోపాటు స్థానిక లక్షలాది శివ భక్తుల మనోభావాలను ప్రభుత్వాలు గుర్తించాలని ఈ ప్రాంతంలో మైనింగ్ చేపడితే వాతావరణ కాలుష్యం, దుమ్ము ధూళి తో అనారోగ్యాలు, భూములు నిస్సారమై పంటలకు పనికి రాకుండా పోయి ఎడారి ప్రాంతం లా మారుతుందని ప్రభుత్వాలు గ్రహించాలన్నారు. నేడు తంబళ్లపల్లె ప్రాంతానికి మల్లయ్య కొండలు పెట్టని కోటలా అటవీ ప్రాంతం పచ్చటి పర్యావరణం, లక్షలాది వన్యప్రాణులు, పశు పక్షాదులు, జీవరాసులు ఆశ్రయం కోల్పోవడంతో పాటు ఈ కొండలను నమ్ముకున్న కొండ శివారు ప్రాంతాలలోని వందలాది గ్రామాల ప్రజలు జీవనోపాధి కోల్పోతారని తెలిపారు. మల్లయ్య కొండ ఇప్పటికే అన్ని రకాలుగా అభివృద్ధి వైపు నడిచి లక్షలాదిమంది భక్తులకు మహాశివుడు ఆరాధ్య దైవంగా నిలిచాడని ఇలాంటి పవిత్రమైన కొండలను మైనింగ్ కు అప్పజెప్పడం స్థానిక ప్రజలకు శరాఘాతంగా తయారవుతుందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా మైనింగ్ కార్యక్రమాలను ఆపాలని ఆమె డిమాండ్ చేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :