Thursday, 30 July 2026 08:11:55 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సియం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఫోటోలకు మహిళలతో కలిసి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే షాజహాన్

మహానాడు లో మహిళలకు 33% రాజకీయ రిజర్వేషన్లు ప్రకటించడంతో మహిళల హర్షం

Date : 29 May 2026 06:44 PM Views : 69

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 29 : మే 28వ తేదీ తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జన్మదిన పురస్కరించుకొని 27, 28వ తేదీ లలో నిర్వహించిన మహానాడు లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహిళా బిల్లు తో సంబంధం లేకుండా మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ప్రకటించడం తో నేడు మదనపల్లి పట్టణం లోని దేవతా నగర్ పార్లమెంట్ తెదేపా కార్యాలయం లో జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు తో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ భాష పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం కుటుంబ సభ్యులు మహిళలు, రాష్ట్రస్థాయి, నియోజవర్గ స్థాయి గ్రామస్థాయిలో వివిధ హోదాలలో ఉన్న మహిళ లతో కలిసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ , జిల్లా అధ్యక్షుడు సుగువాసి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గా నందమూరి తారక రామారావు మహిళలకు తండ్రి ఆస్తులు హక్కు కల్పించడం జరిగిందని, చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి దీపం కనెక్షన్లు అందించారని, 2026 మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం హర్షించ దగ్గ విషయమని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి తులసి రామకృష్ణ, రాష్ట్రస్థాయి మహిళా నేత పర్వీన్ తాజ్, జిల్లా ఉపాధ్యక్షురాలు తలారి రాధా, మాజీ కౌన్సిలర్ పులి మహాలక్ష్మి, లక్ష్మీదేవి, జాఫరున్నిసా,రాటకొండ భారతి నాయుడు, శ్రీరామ నాగమణి, విజయమ్మ, వేంపల్లి భారతి నాయుడు , సోమశేఖర్ నాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ రాజ్ కుమార్, మంగళ ప్రభాకర్, శ్యామలమ్మ, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :