నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 19 : మదనపల్లి ఎన్టీఆర్ ట్రస్ట్, టిడిపి అభిమానులు నాదెళ్ల రమేష్, ఆర్.జె వెంకటేష్, నవీన్ చౌదరి, రఘు ఆధ్వర్యంలో పట్టణం లోని నిమ్మనపల్లి సర్కిల్ లో ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ను నేడు అభిమానులు, టిడిపి కార్యకర్తల నడుమ విగ్రహం ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే షాజహాన్ భాష. ఈ సందర్బంగా దివంగత నేత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి సంవత్సరం లోనే అధికారంలోకి వచ్చి పేద, బడుగు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి , తెలుగు ప్రజల ఆత్మగౌరవం ను నిలబెట్టిన ఘనత ఎన్టీఆర్ దంటూ, వారి ఆశయ సాధన లోనే కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ ని, ప్రజా క్షేమం కోసం పాటు బడుతున్న సియం చంద్రబాబు అడుగుజాడల్లో నడుచుకొందామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే షాజహాన్. విగ్రహం ఆవిష్కరణ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు
Reporter
Namitha News