Friday, 31 July 2026 11:32:28 PM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో మహిళలు వ్యాపారవేత్తలు

Date : 20 February 2026 10:48 PM Views : 171

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 20 ః ప్రభుత్వ పథకాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో భవిష్యత్తులో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని పరిశ్రమల ప్రోత్సాహిక అధికారులు డి శంకరప్ప, కే నాగార్జునలు సూచించారు. శుక్రవారం శ్రీ శక్తి భవన్ లో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో జిల్లా పరిశ్రమల కేంద్రం సారథ్యంలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ వర్క్ షాప్ నిర్వహించారు. మహిళలు వ్యాపార ప్రణాళికలతో అవగాహన పొంది బ్యాంకుల ద్వారా ముద్ర, పిఎం ఈజిపి రుణాలు పొంది వ్యాపార, సేవాపరిశ్రమల రంగాలలో వారికి అవసరమైన ఉద్యం రిజిస్ట్రేషన్ పై అవగాహన కల్పించారు. మహిళలు వ్యాపారాలపై అవగాహన పొంది వినూత్న ఉత్పత్తి రంగాల అవకాశాలపై దృష్టి సారించాలన్నారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. తద్వారా ఆన్లైన్ చేసుకొని రుణం పొంది 35% సబ్సిడీ గ్రహించాలన్నారు. ఈ అవకాశాన్ని మహిళా సంఘాలు, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, సీసీలు కత్తి నరసింహులు, రమణ, ఆదిలక్ష్మి, యానిమేటర్లు, ఎస్ హెచ్ జి సభ్యులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :