నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 06 : తంబళ్లపల్లె ఇండియన్ బ్యాంక్ లో నిత్యం ఖాతాదారులతో రద్దీ రద్దీగా ఉండి ఖాతాదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రంలోని ఇండియన్ బ్యాంక్ రోజురోజుకు మహిళా సంఘాలు, రైతులు, వ్యాపారులు, యువకులు వేలాది ఖాతాలతో అభివృద్ధి చెందింది. అయితే ఇండియన్ బ్యాంక్ చాలీ చాలని ప్రదేశంతో ఉదయం 10 గంటల నుండి బ్యాంకు ఖాతాదారులతో కిటకిటలాడుతుంది. ముఖ్యంగా మహిళా సంఘ సభ్యులు, రైతులు బ్యాంకులో ఏసీ, ఫ్యాన్లు సౌకర్యాలు ఉన్నా తీవ్ర రద్దీతో నిలబడలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంక్ అధికారులు ఇప్పటికైనా స్పందించి మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు
Reporter
Namitha News