నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సర్వమతాలకు అతీతం కడప అమీన్ పీర్ దర్గా.... గంధోత్సవంలో పాల్గొని ఛాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్.... దేశంలోనే ప్రసిద్ధ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రమైన కడప అమీన్ పీర్ పెద్ద దర్గాలో వెలసిన హజరత్ సరమస్త్‌సాని చల్లాకష్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా మొహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిస్టివుల్ ఖాద్రి ఉరుసు ఉత్సవాలలో పాల్గొనడం ఓ ప్రత్యేక అనుభూతి కలిగిస్తుందని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఘనంగా ప్రారంభమైన అమీన్ పీర్ దర్గా ఉరుసు మహోత్సవంలో నిస్సార్ అహమ్మద్ పాల్గొని చాదర్ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం పీఠాధిపతి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ కడప జిల్లాలోని పెద్ద దర్గాకు విశిష్ట ప్రాముఖ్యత ఉందని, సర్వమతాలకు అతీతంగా ఇక్కడ భక్తులు వచ్చి ఉర్సు మహోత్సవంలో పాల్గొంటారని వివరించారు. అమీన్ పీర్ దర్గా వ్యవస్థాపకుడు హజరత్ పీరుల్లా మాలిక్, ఇక్కడ పెద్ద ఉరుసును మాత్రం సూఫీ సర్ మస్తానీ ఆరీఫుల్లా మొహమ్మద్ మొహమ్మదుల్ హుస్సేనీ చిష్టివుల్ ఖాద్రి పేరిట నిర్వహిస్తారని, కాలక్రమేణా అమీర్ పీర్ దర్గాగా పేరొందిందని, ప్రస్తుతం ఈ దర్గా 11వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ ఆరీఫుల్లా మొహమ్మద్ మొహమ్మదుల్ హుస్సేనీ చిష్టివుల్ ఖాద్రి ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.కడప పెద్ద దర్గా సందర్శించడానికి సెలబ్రిటీలతో పాటు చాలామంది ప్రముఖులు హాజరవుతారని అన్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగే ఉరుసు ఉత్సవంలో పాల్గొనటానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తారని అన్నారు.
Reporter
Namitha News