Friday, 31 July 2026 01:52:08 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

నకిలీ ధృవపత్రాలతో పాస్‌పోర్ట్ పొందడానికి యత్నం - నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, 5వేల రూ జరిమానా

Date : 27 January 2026 08:23 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - జనవరి 27: తప్పుడు పత్రాలతో పాస్‌పోర్ట్ పొందేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కిన వ్యక్తికి రాయచోటి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఫోర్జరీ పత్రాల కేసులో నిందితుడైన షేక్ వసీం అక్రమ్‌కు రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు 5,000 రూపాయల జరిమానా విధిస్తూ గౌరవనీయ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ టి. సుయోధన గారు మంగళవారం తీర్పు వెలువరించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాయచోటి టౌన్ అలీమాబాద్ వీధికి చెందిన ఖాజా హుస్సేన్ కుమారుడు షేక్ వసీం అక్రమ్ 2023 నవంబర్ 5న ECNR పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియలో భాగంగా అతను తన పదవ తరగతి మార్కుల మెమోను ఫోర్జరీ చేసి, నకిలీ పత్రాలను అసలైనవిగా నమ్మించి అధికారులను మోసం చేసేందుకు ప్రయత్నించాడు.వసీమ్ అక్రమం పై అప్పటి ఎస్పీ ఆదేశాల మేరకు రాయచోటి అర్బన్ పోలీసులు రంగంలోకి దిగారు. అప్పటి సీఐ సుధాకర్ రెడ్డి సమగ్ర దర్యాప్తు జరిపి, నిందితుడి పై క్రైమ్ నంబర్ 168/2023 కింద సెక్షన్ 420, 464, 468 (IPC) ప్రకారం కేసు నమోదు చేశారు. పక్కా సాక్ష్యాధారాలతో కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ సాయి రామకృష్ణ పటిష్టమైన వాదనలు వినిపించారు. నేరం నిరూపితం కావడంతో, న్యాయమూర్తి నిందితుడు వసీమ్ అక్రమ్ కి రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, 5వేల రూ జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :