Thursday, 30 July 2026 10:58:40 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఓటర్ల నమోదు ప్రక్రియ తర్వాత సెప్టెంబర్ 22 తుది జాబితా - ఎన్నికల అధికారి మాధవ కృష్ణారెడ్డి

Date : 22 May 2026 09:21 PM Views : 95

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 22 : తంబళ్లపల్లె నియోజకవర్గం లో ఓటర్ల నమోదు, పరిశీలన ప్రక్రియ అనంతరం సెప్టెంబర్ 22వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని ఎన్నికల అధికారి మాధవ కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం తాసిల్దార్ కార్యాలయంలో ఆయన రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 15వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు ఓటర్ల జాబితా పరిశీలన జరుగుతుందని జులై 21వ తేదీన ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ విడుదల చేస్తామన్నారు. ఆగస్టు 21వ తేదీ వరకు అబ్జర్వేషన్ చేయడం జరుగుతుందని చెప్పారు. ఓటర్ల తుది జాబితా సెప్టెంబర్ 18 వరకు మరోసారి పూర్తిస్థాయిలో పరిశీలన చేసి సెప్టెంబర్ 22వ తేదీన తంబళ్లపల్లె నియోజకవర్గం ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామన్నారు. జులై 14వ తేదీ నుండి ఒక పోలింగ్ బూత్ లో 1200 ఓట్లకు మించి ఓటర్లు ఉంటే ఓటర్ల జాబితా పరిశీలించి ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న జనగణన కార్యక్రమంలో ఎన్నుమలేటర్లు, సూపర్వైజర్లు ముమ్మరంగా పాల్గొని ఎలాంటి పొరపాట్లు లేకుండా నికాసైన ఓటర్ల జాబితా తయారీకి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, బేరి శ్రీనివాసులు, జనసేన నియోజకవర్గ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి, మండల నాయకుడు సిద్ధమల్ రెడ్డి, బిజెపి నాయకులు గోపాల్ రెడ్డి, మగ్గాలు లక్ష్మయ్య, మండల అధ్యక్షుడు రమణ, కూటమి నాయకులు పాల్గొనగా వైకాపా నాయకులు గైర్హాజరయ్యారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :