Thursday, 30 July 2026 08:54:06 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

కోర్టు దిక్కరణ కారణం గా మదనపల్లె ఆర్ఓ కు పల్లవి కి బైలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ

Date : 13 April 2026 09:11 AM Views : 428

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 13 : బి.కొత్తకోట మున్సిపల్ కమిషనర్ గా పనిచేసి ప్రస్తుతం మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఆర్ఓ ) జీవి.పల్లవి కి అరెస్ట్ కు హైకోర్టు ఈనెల 2న ఉత్తర్వు జారీ చేసింది. ఆమెను అరెస్ట్ చేసి ఈనెల 30న న్యాయస్థానం ముందు హజరుపర్చాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. మున్సిపాలిటీ పరిధిలో ఓ వ్యక్తి ప్లాన్ అప్రూవల్ లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టారని, అక్రమంగా జరుగుతున్న ఈ పనిని కమిషనర్ అడ్డుకోలేదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపారని పేర్కొంటూ రెడ్డెప్ప అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నడుస్తుండగా విచారణ కోసం పల్లవి ని ఆన్ లైన్ లో హజరు కావాలని తెలియజేసినప్పటికి ఆమె హజరు కాలేదని కోర్టు దృష్టికి వచ్చింది. దీన్ని కోర్టు ధిక్కారంగా భావిస్తూ ఆమెకు బెయిలబుల్ అరెస్టు వారంట్ ను జారీ చేయాలని న్యాయ స్థానం ఆదేశించింది. ఈనెల 30 జరిగే తదుపరి విచారణ రోజు ఆమె కోర్టు ఎదుట హజరుకావాలని ఆదేశించింది. ఈ వారెంట్ ను అమలు చేయాలని జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలను పంపారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే రూ.10వేల బాండు, ఇద్దరి పూచికత్తుపై బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. అలాగే ఈనెల 30న జరిగే కేసు వాయిదాకు హజరవుతానని, ఆ తర్వాత కూడా కోర్టు ఆదేశించే వరకు హజరువుతానని ఆమె ప్రమాణపత్రం ఇవ్వాలని ఆదేశాల్లో న్యాయస్థానం పేర్కొంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: