Friday, 31 July 2026 12:41:48 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

11వ తేదీన తంబళ్లపల్లె ఎంపీపీ ఎన్నిక

Date : 08 December 2025 10:01 PM Views : 236

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 08 : తంబళ్లపల్లె మండల పరిషత్ అధ్యక్షురాలి ఎన్నిక ఈనెల 11వ తేదీన జరగనున్నట్లు ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ తెలిపారు. తంబళ్లపల్లె మాజీ ఎంపీపీ అనసూయమ్మ ఈఏడాది అక్టోబర్ 13న తన వ్యక్తిగత కారణాలవల్ల ఎంపీపీ పదవికి రాజీనామా చేశారు. ఎంపీపీ అనసూయమ్మ పై పదిమంది ఎంపీటీసీలు అవిశ్వాసం ప్రకటించడంతో అక్టోబర్ 27వ తేదీన ఎంపీడీవో పట్నాయక్ మెజారిటీ ఎంపీటీసీల ఆమోదంతో జడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు ఆదేశాల మేరకు కోసువారిపల్లి ఎంపీటీసీ మండల ఉపాధ్యక్షురాలు చిటికి శ్యామలమ్మను ఇంచార్జ్ మండల పరిషత్ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పలు మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలు ఈనెల 11వ తేదీ 11 గంటలకు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా లోని విజయపురం, నిండ్ర, తిరుపతి జిల్లా లోని ఏర్పేడు, వరదయ్యపాలెం, సత్యవేడు తో బాటు అన్నమయ్య జిల్లా లోని తంబళ్లపల్లె ఎంపీపీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 11వ తేదీ 11 గంటలకు మండలంలోని 11 మంది మెజారిటీ ఎంపీటీసీలు ఆమోదంతో ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ విలేకరులకు తెలిపారు. ఈ ఎన్నిక నిర్వహణ తంబళ్లపల్లె స్పెషలాఫీసర్ డిఎల్డిఓ అమరనాథరెడ్డి సారథ్యంలో జరుగుతుందని ఈ సందర్భంగా 11 మంది ఎంపీటీసీ సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుందని అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎంపీడీవో కార్యాలయం వద్ద పఠిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: