నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 08 : భారతదేశానికి పాలనా సంస్కరణల ఆధ్యుడు దివంగత మాజీ ప్రధాని వాజ్ పాయ్ విగ్రహ ప్రతిష్ట ఈనెల 14వ తేదీన మదనపల్లెలో జరిగే కార్యక్రమానికి బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం బిజెపికి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దేశంలో బిజెపి బలోపేతానికి దివంగత మాజీ ప్రధాని వాజ్ పాయ్ చేసిన కృషి వర్ణనాతీతమన్నారు. బిజెపి తొలి ప్రధానిగా తొలుత 13 రోజులు పనిచేసి ప్రలోభాలకు లోను కాకుండా పదవి త్యాగం చేసిన రాజకీయ దురందరుడని కొనియాడారు. ప్రధానిగా ఆయన చేసిన ప్రజాసేవ తో పాటు బిజెపి నేడు పాలనలో అగ్రస్థానంలో నిలవడానికి ఆయన వేసిన పునాది నేటి నాయకులకు ఆదర్శవంతమని అలాంటి నాయకుడి విగ్రహ ప్రతిష్ట మదనపల్లిలో ఏర్పాటు చేసుకోవడం మన అదృష్టమన్నారు. కాన మండలంలోని బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలి రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు పి వెంకటరమణ, బిజెపి సీనియర్ నాయకుడు గోల్డెన్ వ్యాలీ రమణారెడ్డి, మాజీ సర్పంచ్ రామస్వామి రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ శంకర్ రెడ్డి, యుగంధర్, రాఘవరెడ్డి, వెంకటరమణారెడ్డి, కొటాల మల్లికార్జున, హరినాథ్ రెడ్డి, మోహన్ మండలంలోని బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News