Friday, 31 July 2026 04:53:49 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మహారాష్ట్ర లో పులి దాడిలో నలుగురు మహిళలు మృతి

Date : 22 May 2026 07:15 PM Views : 164

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మహారాష్ట్రలో దారుణ ఘటన ఆకులు ఎరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలు పులి దాడిలో మృతి . భయాందోళనలో గంజేవాహి అటవీ ప్రాంత ప్రజలు. అడవిలో బీడీ ఆకులు ఏరుకోవడానికి వెళ్లిన నలుగురు మహిళలపై ఒకేసారి పులి దాడి చేసి చంపిన సంఘటన మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా గంజేవాహి అటవీ ప్రాంతంలో చోటుచేసుకొంది. దీంతో సిందేవహి తాలుకాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం పెద్ద సంఖ్యలో గ్రామీణ ప్రజలు ఎండిపోయిన బీడీ ఆకులు ఏరుకొనేందుకు అటవీ ప్రాంతంలోకి వెళ్లగా ఉదయం 8 గంటల సమయంలో ఓ పులి మాటువేసి వారిపై దాడి చేసింది దీనితో ఘటనా స్థలంలోనే నలుగురు మహిళలు మృత్యువాత పడ్డారు. మృతులను దాదాజీ మొహర్లే, అనుబాయి దాదాజీ మొహర్లే, సంగీతా సంతోష్ చౌదరీ, సునీతా కౌశిక్ మొహర్లేగా గుర్తించారు. వీరంతా 33 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్యవారే. ఈ ఘటన తర్వాత అటవీ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఫారెస్ట్ రేంజి అధికారి అంజలీ సాయంకర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఒకేసారి పులి దాడిలో నలుగురు మహిళలు చనిపోవడంతో అటవీ పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :