Thursday, 30 July 2026 04:02:03 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

అందరికీ ఆహార భద్రత - అందుబాటు లోకి రానున్న మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు

15న ధరణికోట లో ప్రారంభించనున్న సియం - 269కి పెరిగిన క్యాంటీన్ల సంఖ్య - ఇప్పటికే 207 క్యాంటీన్ల ద్వారా ప్రతీ రోజు 2.10 లక్షల మందికి భోజనం

Date : 13 April 2026 11:12 PM Views : 228

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి - ఏప్రిల్ 13 : కార్మికులు, కూలీలు, గ్రామీణులు వివిధ పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చే ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదన్న సంకల్పంతో 207 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసిన ప్రజా ప్రభుత్వం... తాజాగా మరికొన్ని అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకొస్తోంది. రూ.5లకే పేదలకు కడుపునిండా నాణ్యమైన భోజనాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ సేవలను గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తామని చెప్పిన సర్కార్... ఆ హామీని ఆచరణలో పెడుతోంది. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లను కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయగా 3 క్యాంటీన్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 62 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. రెండవ విడత అన్నక్యాంటీన్లను ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబు పెదకూరపాడు నియోజకవర్గం, ధరణికోటలో ప్రారంభిస్తారు రూ.5లతో రుచిగా, శుచిగా ఆహారం గత ప్రభుత్వం కక్షగట్టి మూసివేసిన అన్నక్యాంటీన్లను కూటమి అధికారంలోకి వచ్చాక పున: ప్రారంభించింది. ఈనెల 15వ తేదీన ప్రారంభించబోయే 62 క్యాంటీన్లతో ఈ సంఖ్య 269 కు పెరుగనుంది. రుచి, శుచితో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని పేదలకు ప్రభుత్వం అందిస్తోంది. క్యాంటీన్ల పున:ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా పేదలు 8.80 కోట్ల భోజనాలు చేశారు. ఒక్కో అన్న క్యాంటీన్‌లో సగటున రోజుకు 1,013 మంది చేసే భోజనాలకు రూ.26,250 ఖర్చు అవుతోంది. 207 అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకు 2.10 లక్షల మంది భోజనాలు చేస్తున్నారు. ఇందుకు రోజుకు రూ.54 లక్షలకు పైగా వ్యయం అవుతుండగా... సబ్సిడీ కోసం ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.243 కోట్లు వెచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసే గ్రామీణ అన్న కాంటీన్ల సబ్సీడీకి ఏడాదికి రూ.58 కోట్లు వ్యయం అవ్వనుంది

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: