Thursday, 30 July 2026 04:17:30 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం

మెగా పేరెంట్స్ మీటింగ్‌లో పాల్గొన్న తంబళ్లపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్

Date : 24 July 2026 04:53 PM Views : 73

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూలై 24 : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, విద్యా & ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గార్ల మార్గదర్శకత్వంలో రాష్ట్ర విద్యాశాఖ నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ (PTM 4.0) కార్యక్రమం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం, ములకలచెరువు మండల పరిషత్ హైస్కూల్‌ , ఏపీ మోడల్ స్కూల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ గారు, ములకలచెరువు ఎస్‌ఐ ఉమామహేశ్వర రెడ్డి గారు, టీడీపీ మండల అధ్యక్షులు పాలగిరి సిద్ధ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయినాథ్ గారు మాట్లాడుతూ, విద్యార్థులలో నైపుణ్యం, సృజనాత్మకత పెంపొందించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేయడంలో మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ ఎంతో కీలకమని అన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య, మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన బోధన అందించేందుకు కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్లు, 'తల్లికి వందనం' వంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తోందన్నారు. విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను షైనింగ్ అవార్డ్స్ ద్వారా సత్కరించడం అభినందనీయమని చెప్పారు. ప్రతి విద్యార్థి అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, పిల్లల చదువు, క్రమశిక్షణ, ప్రతిభ, ఆసక్తులను ఎప్పటికప్పుడు తెలుసుకుని ప్రోత్సహించాలని సూచించారు. ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల మధ్య సమన్వయం పెంపొందించడమే మెగా పేరెంట్స్ మీటింగ్ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యా పురోగతి, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర రంగాల్లో సాధించిన విజయాలపై తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల ప్రగతి నివేదికలను తల్లిదండ్రులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పూజారి సురేంద్ర, మండల ప్రధాన కార్యదర్శి మారుజోల్లా సుదర్శన్, గోవిందు ఉత్తన్న, ఆవుల శంకర, కామాక్షి ఆంజనేయులు, ఈ. శంకర, స్కూల్ చైర్మన్ రాధిక గారు, వైస్ చైర్మన్ మొఘల్ భావజన్, పవన్ కుమార్, ఏసు హరి, కూటమి నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :