Thursday, 30 July 2026 04:17:30 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లి లో ఘనంగా ముగిసిన ఇషా గ్రామోత్సవాలు

Date : 19 July 2026 03:25 PM Views : 83

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూలై 19 : అన్నమయ్య జిల్లా లోని మదనపల్లి సమీపంలోని ప్రకృతివనం లో నిర్వహించిన ఇషా గ్రామోత్సవాలు ఘనంగా ముగిశాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, మహిళల్లో ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా గ్రామోత్సవాల రెండవ రోజు గ్రామీణ మహిళల కోసం త్రో బాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో సుమారు 12 గ్రామాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు . క్రీడాస్ఫూర్తితో జరిగిన ఈ పోటీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ రాధిక, విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి నిషిత చేతు , ప్రకృతి వనం వ్యవస్థాపకురాలు శ్రీమతి యోగితా ప్రసాద్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, ఇషా గ్రామోత్సవాలు గ్రామీణ మహిళల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి, క్రీడాస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు మరియు సామాజిక ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పోటీల్లో విజేతలకు అభినందనలు తెలియజేస్తూ, పాల్గొన్న ప్రతి మహిళ విజేతేనని అతిథులు కొనియాడారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన నిర్వాహకులు, స్వచ్ఛంద కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు పాల్గొన్న మహిళలందరికీ కృతజ్ఞతలు తెలిపారు

ఈ గ్రామోత్సవాలు గ్రామీణ మహిళల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, గ్రామాల మధ్య స్నేహభావం, ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమం లో ఇషా ప్రతినిధులు డాక్టర్ జి అజ్మతుల్లా ఖాన్, ఐశ్వర్య, కిషోర్, అశోక్, హర్షిత, దామోదర్ పాల్గొన్నారు

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :