నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 21 : తంబళ్లపల్లె మండలం జింజర్ పెంట పంచాయతీ పరిధిలోని పెద్దేరు ప్రాజెక్టు ను మంగళవారం హైడ్రాలజీ అధికారుల బృందం విస్తృతంగా పర్యటించారు. ఉదయం పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్ ఆధ్వర్యంలో హైడ్రాలజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్, డిఈ సత్యవతి, ప్రాజెక్ట్ ఇరిగేషన్ డిఈ చెన్నకేశవరెడ్డి, ఏఈ సతీష్ లు ప్రాజెక్ట్ లో ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ సిస్టమ్స్, గేట్లు, లాక్ లు మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు పై ఆరా తీశారు. ప్రాజెక్టు కింది భాగంలోని గేట్లు పనితీరు పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు పరిధిలోని రెయిన్ గేజ్ పరిశీలించి పనితీరుపై చైర్మన్ శివ కుమార్ ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు పెద్దేరు ప్రాజెక్టు పరిధిలోని హైడ్రాలిక్ సిస్టం పనితీరు పై ప్రాజెక్ట్ ఇరిగేషన్ అధికారులకు పాలు సలహాలు సూచనలు చేశారు. హైడ్రాలిక్ సిస్టం పనితీరు పై ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని సూచించారు. వారి వెంట పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టు కమిటీ మెంబర్లు, లస్కర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News