నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 28 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) విభాగం వారు మిట్స్ అల్యూమిని రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో "స్మృతి సంగమం-2026 " అనే పేరుతో అల్యూమినీ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ నందు 2024 మరియు 2025 సంవత్సరంలో చదువుకున్నపూర్వ విద్యార్థులు హాజరైనారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధిలో మరియు ప్రస్తుత విద్యార్థుల భవిష్యత్ రూపకల్పనలో అల్యూమిని విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పరిశ్రమల్లో స్థిరపడిన అల్యూమిని విద్యార్థులు తమ అనుభవాలు, నైపుణ్యాలు, కెరీర్ మార్గదర్శకత్వాన్ని ప్రస్తుత విద్యార్థులతో పంచుకోవడం ద్వారా వారికి సరైన దిశానిర్దేశం లభిస్తుందని అన్నారు. అలాగే ఇంటర్న్‌షిప్స్, ప్లేస్‌మెంట్స్, స్టార్టప్ అవకాశాలు, పరిశోధన కార్యకలాపాల్లో తమ సహకారం సంస్థకు మరింత బలాన్నిస్తుందని పేర్కొన్నారు. అల్యూమిని మరియు యూనివర్సిటీ మధ్య బలమైన అనుబంధం కొనసాగితే విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని, సమాజానికి ఉపయోగపడే నాణ్యమైన ఇంజినీర్లను తయారు చేయడం సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అల్యూమిని పి.జయప్రకాశ్,రషీద్ అహ్మద్ మరియు సయ్యద్ సమద్ లు మాట్లాడుతూ తమ ఉద్యోగ జీవితానికి బలమైన పునాదిని అందించిన మిట్స్ యూనివర్సిటీ మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకుల నాణ్యమైన బోధన, ఆధునిక ల్యాబ్ సౌకర్యాలు తమను పరిశ్రమ అవసరాలకు తగిన విధంగా తీర్చిదిద్దాయని అన్నారు. ప్రస్తుత విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్తులో కూడా సంస్థ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఆర్.కల్పనా, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.నాగాశ్వేత,అసిస్టెంట్ డైరెక్టర్-ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పి.ఎమ్ బాలాజీ, అల్యూమినీ కోఆర్డినేటర్ ఎస్తర్ మెర్లిన్, డాక్టర్ చొక్కనాథన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
Namitha News