నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విద్యార్థుల్లో పరిశోధన పట్ల ఆసక్తి పెంపొందించిన ఎంసిఏ విభాగం సెమినార్. అకాడెమిక్ రైటింగ్, రీసెర్చ్ పేపర్ ప్రిపరేషన్‌పై మార్గదర్శక సదస్సు విజయవంతం మదనపల్లెలోని విశ్వం ఇంజినీరింగ్ కళాశాల, ఎంసిఏ విభాగం ఆధ్వర్యంలో అకాడమిక్ రైటింగ్ ప్రిపేర్ విత్ పేపర్ ప్రజెంటేషన్ అనే అంశంపై మార్చి 24, 2026 (మంగళవారం) ఉదయం 10:00 గంటలకు, ఏ బ్లాక్‌లోని సి.వి. రామన్ బ్లాక్, గది నం. 215లో ఒక ప్రత్యేక సెమినార్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. ఎం. అంజన్ కుమార్, ప్రొఫెసర్ (సిఎస్‌ఇ) మరియు రీసెర్చ్ & డెవలప్మెంట్ డీన్ హాజరై విద్యార్థులకు విలువైన మార్గదర్శకత్వం అందించారు. సెమినార్‌లో ఆయన అకాడెమిక్ రైటింగ్ ప్రాముఖ్యత, రీసెర్చ్ పేపర్ నిర్మాణం (అబ్స్ట్రాక్ట్, ఇంట్రడక్షన్, మెథడాలజీ, ఫలితాలు, ముగింపు), సరైన జర్నల్స్ మరియు కాన్ఫరెన్సుల ఎంపిక, ఇండెక్సింగ్, ఇంపాక్ట్ ఫ్యాక్టర్స్, ప్లేజరిజం నివారణ, రీసెర్చ్ నైతికత, సైటేషన్ విధానాలు వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. అలాగే, సమర్థవంతమైన రీసెర్చ్ పేపర్ రచనకు అవసరమైన చిట్కాలు, పరిశోధన పత్రాలను ధైర్యంగా ప్రదర్శించే విధానాలపై కూడా సూచనలు అందించారు. ఈ సెమినార్‌లో ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఎంసిఏ విద్యార్థులు చురుకుగా పాల్గొని తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. అధ్యాపకులు వారికి మార్గదర్శకత్వం అందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అకాడెమిక్ రైటింగ్‌పై అవగాహన పెరిగి, ప్రెజెంటేషన్ నైపుణ్యాలు మెరుగుపడి, పరిశోధన మరియు ప్రచురణలపై ఆసక్తి పెరిగింది అని ఎంసీఏ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి డాక్టర్ ఉషారాణి మొత్తానికి ఈ సెమినార్ విజయవంతంగా నిర్వహించబడటంతో పాటు విద్యార్థుల అకాడెమిక్ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడింది అని తెలియజేశారు.
Reporter
Namitha News