నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం స్వాతంత్య్ర ఉద్యమాలు చేసి జాతి ఉనికిని చా టుకున్న గొప్ప వ్యక్తి వడ్డె ఓబన్న అని వడ్డెర నాయకులు పేర్కొన్నా రు. రామసముద్రం మండలం లోని నరసాపురంలో వడ్డె ఓబన్న జయంతిని మండలం వడ్డె సంఘ అధ్యక్షుడు రెడ్డప్ప అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం దిగువపేట పెట్రోల్ బంక్ నుంచి ర్యాలీ నిర్వహించి చెక్ పోస్ట్ నందు ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం జనవరి 11న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా,రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది,తెలిపారు.ఎందుకంటే ఆయన దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ పాలనను ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు, దీనిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది, దీంతో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయన విగ్రహాలకు నివాళులర్పిస్తూ వేడుకలు జరుగుతాయని ఆకాంక్షించారు.
Reporter
Namitha News