Friday, 31 July 2026 09:35:07 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

పవన్ కళ్యాణ్ ప్రజాదరణను చూసి భయపడుతున్నారా.?

Date : 02 June 2026 07:05 PM Views : 185

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పవన్ కళ్యాణ్ ప్రజాదరణను చూసి భయపడుతున్నారు జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్ పుంగనూరు, జూన్ 3: జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడం లేదా ఆయన కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం ఎవరి వల్లా కాదని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్ విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు జనసేన పార్టీ చేసిన ప్రయత్నాలకు అనుమతులు నిరాకరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ కేవలం ఒక రాష్ట్ర నాయకుడు మాత్రమే కాదని, దేశవ్యాప్తంగా యువత, ప్రజల్లో విశేష ఆదరణ పొందిన నాయకుడని అన్నారు. అలాంటి నాయకుడి సభలకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఏ రాష్ట్రంలోనైనా రాజకీయ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని, దేశంలో తిరగడానికి పాస్‌పోర్ట్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి కొందరు రాజకీయ నాయకులు భయపడుతున్నారని, అందుకే జనసేన పార్టీ కార్యకలాపాలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో కూడా జనసేనకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోందని, ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేక కొందరు నాయకులు అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు. జనసేన పార్టీ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని, ప్రజల మద్దతుతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ప్రభుత్వాలు రాజకీయ పక్షపాత ధోరణితో వ్యవహరించడం సరికాదని, ఇలాంటి చర్యలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతాయని చైతన్య రాయల్ హెచ్చరించారు.

Sathya

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: