Friday, 31 July 2026 01:29:51 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

బీసీ ల అభ్యున్నతి కి బోడె రామచంద్ర యాదవ్ బీసీ ధర్మ దీక్ష పేరుతో ఆమరణ నిరాహారదీక్ష

బీసీ సింహగర్జన డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 11నుండీ బిసివై అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష

Date : 02 April 2026 07:09 PM Views : 244

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి - ఏప్రిల్ 02 : బీసీల న్యాయమైన హక్కుల సాధనకై భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్, ముందుగా ప్రకటించిన విధంగా ఏప్రిల్ 11వ తేదీ నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. "బీసీ సింహగర్జన" సభలో ప్రభుత్వం ముందు ఉంచిన ఐదు కీలక డిమాండ్లపై ఇచ్చిన గడువు ముగిసినా ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మంగళగిరిలోని బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం "పూలే-మండల్ భవన్" వేదికగా "బీసీ ధర్మ దీక్ష" పేరుతో ఈ ఆమరణ నిరాహార దీక్ష జరగనుంది. దశాబ్దాలుగా బీసీలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయానికి వ్యతిరేకంగా, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు రామచంద్ర యాదవ్ ఈ కఠోర దీక్షకు పూనుకున్నారని పార్టీ పేర్కొంది. *ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాల్సిన ఐదు కీలక డిమాండ్లు* *1.బీసీ రక్షణ చట్టం:* బీసీల సామాజిక భద్రత కోసం ప్రత్యేకంగా "బీసీ రక్షణ చట్టాన్ని" వెంటనే అమలు చేయాలి *2.అమరావతిలో భూమి:* రాజధాని అమరావతిలో బీసీల ఆత్మగౌరవ భవనాలు, ఇతర అవసరాల కోసం వెయ్యి ఎకరాలు కేటాయించాలి *3.సమగ్ర కులగణన:* రాష్ట్రంలో శాస్త్రీయ ప్రాతిపదికన సమగ్ర కులగణన చేపట్టి, బీసీల కచ్చితమైన జనాభా లెక్కలను తేల్చాలి *44% రిజర్వేషన్లు:* విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు వారి జనాభా దామాషా ప్రకారం 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలి *5.బీసీ కార్పొరేషన్లకు నిధులు:* నిర్వీర్యం చేయబడిన బీసీ కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేసి, బీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలి ప్రభుత్వం బీసీల సహనాన్ని పరీక్షించవద్దని, వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని బీసీవై పార్టీ హితవు పలికింది. ఈ ధర్మ దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు సంఘీభావం తెలిపి, విజయవంతం చేయాలని పార్టీ పిలుపునిచ్చింది.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :