Thursday, 16 April 2026 08:03:04 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ప్రకృతి సాగు లో గుండ్లపల్లి ఆదర్శవంతం కావాలి - పోర్డు డైరెక్టర్ జె. లలితమ్మ

Date : 21 November 2025 07:34 PM Views : 110

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 21 ః నేటి ఆధునిక యుగంలో ప్రకృతి వ్యవసాయం సాగులో గుండ్లపల్లి పంచాయతీ లోని రైతులు రాష్ట్రానికే ఆదర్శవంతంగా నిలవాలని ఫోర్డ్ డైరెక్టర్ జె.లలితమ్మ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంపై అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు రసాయన ఎరువుల తో పండిన పంటలతో ఆరోగ్యం క్షీణించి తద్వారా పర్యావరణం కాలుష్యం పెరుగుతోందని దీని నివారణకు ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలన్నారు. నాటి పూర్వికులు ప్రకృతి వ్యవసాయ పంటలతో ఆరోగ్యంతో పాటు పాడి పంటలతో సుఖంగా జీవించారని నేడు వారి స్ఫూర్తితో ప్రకృతి వ్యవసాయం పై దృష్టి సారించాలని సూచించారు. రైతులు స్థానికంగా జరిగే పశువుల ఎరువు, కషాయాలు, కృత్రిమ ఎరువులతో పండించే పంటలు భావితరాలకు ఆదర్శమన్నారు. ప్రకృతి వ్యవసాయం కోసం గుండ్లపల్లి గ్రామం పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకొని వారికి ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చామని ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించేలా సహకరించాలన్నారు. వ్యవసాయ, హార్టికల్చర్,సెరికల్చర్, వ్యవసాయ అనుబంధ శాఖ అధికారులు, మహిళా సంఘాలు ప్రకృతి వ్యవసాయ సాగు పై అవగాహనకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో థామస్ రాజా, ఏపీవో అంజనప్ప, కన్సల్టెంట్ ప్రల్లాద, ఫోర్డ్ సిబ్బంది రమణ, సంపూర్ణ, శైలజ మండలంలోని వ్యవసాయ అధికారులు , ఎంపీఎం సభ్యులు రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :