Thursday, 30 July 2026 03:37:04 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

చెంబకూరు జడ్పి హై స్కూల్ లో సైబర్ నేరాల పై అవగాహన

Date : 06 December 2025 10:43 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 06 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం లోని చెంబకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం వారం హెచ్.ఎం రమేష్ బాబు ఆధ్వర్యంలో ఇంచార్జి హెచ్ ఎం నాగరత్నమ్మ అధ్యక్షతన నిర్వహించారు.ఎస్సై విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల, ఫోక్సొ చట్టం, రహదారి రవాణా నియమాలు,మహిళల భద్రత, మంచి అలవాట్లపై అవగాహనపై ఎస్సై మాట్లాడుతూ విద్యార్థు లు బాగా చదివి ఉన్నత శిఖరాలకు చేరుకుని చదువు చెప్పిన ఉపాధ్యాయులకు తల్లి దండ్రులకు మంచి పేరు ప్రక్యాతలు తీసుకురావాలన్నారు. విద్యా ర్థులు ముఖ్యం గా ఫోన్ కి అలవాటు పడకండి పేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్ కి వెళ్ళకూడదన్నారు. ఫోన్ మంచికి వినియోగించుకోవాలని గ్రామల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మీరు వెళ్లి మీ తల్లి దండ్రులకు ఎవ్వరైనా ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పండి అని అడిగితే మీరు చెప్పకుండా వుండాలన్నారు. సైబర్ నేరగాళ్లు వలన ఎంతో మంది ప్రజలు, ఐటీ ఉద్యోగస్తులు మోసపోతున్నారని వారి మోసాలకు బలి కాకూడదన్నారు.నేను చిన్నప్పటి నుంచి ఒక ఆశయం ఉన్నదని నేను కష్ట పడి చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడి ఒక ఇండిక కారు కొనాలని కోరుకున్నానని ఇప్పుడు కారుకొన్నానని మీరు కష్టపడి చదువుకుని మంచిగా ఉద్యోగం సంపాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. మండలంలోని తిరుమలరెడ్డిపల్లె గ్రామంలో ప్రముఖులు గా ఉన్నారని వారిలో ముఖ్యం గా అన్నమయ్య కీర్తనలు ఆలపించే డాక్టర్ శోభా రాజు, కలెక్టర్ సుదర్శన్ రెడ్డి, సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో సీఐ గా వల్లాల శ్రీధర్ విధులు నిర్వహిస్తున్నారని, ఈ మధ్యనే ప్రముఖ సినీనటి సమంత ను వివాహం చేసుకున్న రాజ్ నిడి మోరు వీరి గ్రామానికి చెందిన వారే వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలన్నారు. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని మీరు మాకు ఎప్పుడైనా ఈ నెంబర్ కు 100,108చేయండి మేము అందుబాటులో ఉంటామన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :