నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - మే 09 : తంబళ్లపల్లె మండలంలో రైతులు, వినియోగదారుల విద్యుత్ సమస్యల పరిష్కారానికి సిబ్బంది సహకారంతో నిరంతరం కృషి చేస్తున్నట్లు ఏఈ సురేంద్ర తెలిపారు. శనివారం విద్యుత్ శాఖ ఏడి గోవిందరెడ్డి ఆదేశాల మేరకు వర్షాకాలం దృశ్య ముందస్తుగా మండలంలోని కన్నెమడుగు విద్యుత్ సబ్ స్టేషన్ నుండి కోసువారిపల్లె సబ్ స్టేషన్ పరిధి వరకు ఏఈ సురేంద్ర సూచనలతో లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు లైన్మెన్ శంకర్ సారధ్యంలో రైతులు, ప్రజల సహకారంతో 33కేవి విద్యుత్ లైన్ పై చెట్ల కొమ్మల తొలగింపు, విద్యుత్ వైర్ల మరమ్మత్తులు ముమ్మరంగా చేపట్టారు. రైతుల వ్యవసాయ బోర్ల వద్ద ట్రాన్స్ఫార్మర్లు పనితీరు, మైనర్ సమస్యల పరిష్కారం చేశారు. అదేవిధంగా తంబళ్లపల్లె మండల కేంద్రం లో ఆర్డీఎస్ఎస్ లో పోలీస్ స్టేషన్ నుండి పెద్దమండెం రోడ్డు వరకు నూతన విద్యుత్తు లైను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ అంతరాయానికి సహకరించిన వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపి విద్యుత్ సమస్యల పరిష్కారంలో కృషి చేసిన సిబ్బందిని ఏఈ ప్రశంసిస్తూ భవిష్యత్తులో రైతులు, వినియోగదారుల సమస్యల పరిష్కారానికి నిత్యం అందుబాటులో ఉండి పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట ఏ ఎల్ ఎం లు అమీన్, జనార్ధన్, శేషు, షిఫ్ట్ ఆపరేటర్లు ప్రసాద్, సురేంద్ర, రాజశేఖర్, అనంత్, ఇంతియాజ్, శ్రీకాంత్ తో పాటు సుమారు 20 మంది విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారంలో ఆ శాఖ అధికారుల పనితీరుపై రైతులు, వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
Reporter
Namitha News