Sunday, 02 August 2026 03:40:09 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

22-A భూ సమస్యలకు చెక్ పెట్టుతూ అధికారులు పరిష్కారం - ఊరట చెందుతున్న రైతులు

Date : 15 June 2026 07:15 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జూన్ 15 : అన్నమయ్య జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 22-A భూ సమస్యలకు జిల్లా యంత్రాంగం వేగంగా పరిష్కారం చూపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక చర్యల ఫలితంగా మదనపల్లి రాయచోటి, పీలేరు సబ్ డివిజన్ల పరిధిలో ఏళ్లుగా పరిష్కారం కాని 22- A సంబంధిత 27మంది రైతులకు సంబంధించిన 27.31ఎకరాలు భూ సమస్యలను పరిష్కరించినట్లు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ తెలిపారు

సోమవారం మదనపల్లి కలెక్టరేట్లో భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి పి.జి.ఆర్.ఎస్ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ... ఆయా డివిజన్ల పరిధిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత పాత రికార్డులు, దస్త్రాలను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించామని తెలిపారు. ముఖ్యంగా ఐదు నుంచి ఏడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. భూమి రికార్డులు సరిగ్గా ఉండటం రైతులకు అత్యంత కీలకమని, పంట రుణాలు, భూమి లావాదేవీలు మరియు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో వెబ్‌ల్యాండ్ రికార్డులు ముఖ్య పాత్ర పోషిస్తాయని జేసి వివరించారు. రికార్డుల్లో ఉన్న లోపాలను సరిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే జిల్లా పరిపాలన ప్రధాన లక్ష్యమన్నారు. మిగిలిన దరఖాస్తులను కూడా వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, రెవెన్యూ శాఖ అధికారులు బాధ్యతతో పనిచేసి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని జేసి పేర్కొన్నారు.

22-A భూ సమస్యలు పరిష్కరించిన 27మంది రైతులకు, ప్రజలకు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి మంజూరు పత్రాలను అందజేశారు. గత అనేక సంవత్సరాలుగా సర్వే నంబర్ సవరణలు, కొత్త సర్వే నంబర్ల చేర్పులు, అడంగల్ వివరాల సరిదిద్దడం వంటి సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులకు ఈ చర్యల ద్వారా ఊరట లభించింది. *వివరాలు:* 1. మదనపల్లి డివిజన్ - 5 మంది - 9.56 ఎకరాలు. 2. పీలేరు డివిజన్ - 18 మంది - 7.61 ఎకరాలు 3. రాయచోటి డివిజన్ - 4 మంది. - 10.14 ఎకరాలు 4. మొత్తం :- 27 మంది - 27.31 ఎకరాలు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :