నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : పుంగనూరు - మే 15 : నెల్లూరులోని పెన్నా నది గట్టున రంగనాయకుల పేటలో వెలిసి ఉన్న పురాతన విష్ణు దేవాలయమైన శ్రీశ్రీశ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ఆలయ నూతన కమిటీలో ఆత్మకూరుకు చెందిన ఆర్యవైశ్య ప్రముఖులైన మాజీ వార్డు కౌన్సిలర్ దోర్నాదుల..సురేష్ బాబు గారి సతీమణి దోర్నాదుల.రాధిక గారికి దేవస్థానం నూతన పాలకవర్గం సభ్యురాలుగా స్థానం కల్పించి బోర్డు సభ్యురాలుగా అవకాశం కల్పించడంతో ఆత్మకూరు వాసులు ఎంతో ఆనందాన్ని వ్యక్తపరిచారు.. ఈ సందర్భంగా సురేష్ బాబు గారి ఆత్మీయులైన ఆత్మకూరుకు చెందిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సందాని,విశ్రాంత ఉపాధ్యాయులు సాదిక్ హుస్సేన్ లు నేడు సురేష్ బాబు నివాసానికి వెళ్లి దోర్నాదుల.రాధిక గారిని మరియు సురేష్ బాబు గారికి పుష్పగుచ్చాన్ని అందించి శాలవతో ఘనంగా సత్కరించి తమ ఆనందాన్ని అభిమానాన్ని వ్యక్తపరిచారు.. తమపై అభిమానంతో తమను సత్కరించిన సందాని, సాదిక్ లకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా తమకు ఈ అవకాశం ఇచ్చిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి సురేష్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.. వీరికి ఈ పదవి లభించడంపై ఆత్మకూరువాసులు ఎంతో సంతోషంగా వ్యక్తపరిచారు
Also Read : ఎన్నికలు అవగానే చమురు ధరలు పెంచిన మోసకారి బిజెపి ప్రభుత్వం
Reporter
Namitha News