Thursday, 16 April 2026 03:06:43 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన బి. పావని

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీఎస్పీ

Date : 13 April 2026 10:17 PM Views : 105

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 13: మదనపల్లె పోలీస్ సబ్ డివిజన్ నూతన డీఎస్పీగా బి.పావని సోమవారం బాధ్యతలు చేపట్టారు. 2023 వ బ్యాచ్ లో నేరుగా డీఎస్పీ గా ఎంపికైన ఆమెకు ఇదితొలి పోస్టింగ్. బాధ్యతలు స్వీకరించిన అనంతరం, ఆమె మదనపల్లి లోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారిని, మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారికి పూలమొక్కను అందజేసి విధుల్లో చేరినట్లు నివేదించిన డీఎస్పీకి ఎస్పీ గారు శుభాకాంక్షలు తెలుపుతూ, సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణపై దిశానిర్దేశం చేశారు. మదనపల్లె పట్టణంలో ప్రధాన సమస్యగా మారిన ట్రాఫిక్ రద్దీపై ఎస్పీ గారు ప్రత్యేకంగా చర్చించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. అక్రమ పార్కింగ్, రహదారుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరించి ప్రజలకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కల్పించాలి. డీఎస్పీగా తొలి బాధ్యతలే మదనపల్లె వంటి కీలక డివిజన్‌లో రావడం శుభపరిణామమని, శక్తివంచన లేకుండా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్, సైబర్ నేరాల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం గస్తీ పెంచాలని, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. బాధితులు ధైర్యంగా స్టేషన్‌కు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేలా సిబ్బంది పనితీరు ఉండాలని, తక్షణ న్యాయమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. అనంతరం డిఎస్పీ గారు జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి గారిని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లె పట్టణ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎక్కడా రాజీ పడబోనని ఆమె పేర్కొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :