Friday, 31 July 2026 01:49:57 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ విద్యార్థులకు ఆరోగ్యం, సైబర్ దాడులు, సోషల్ మీడియా వినియోగం పై అవగాహన

Date : 02 March 2026 08:34 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 02 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ఆరోగ్యం మరియు శ్రేయస్సు, సైబర్ దాడులు మరియు సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్, దక్షిణ భారత అధ్యక్షుడు డాక్టర్ జయవర్మ ఆర్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ ఫోన్ మరియు సోషల్ మీడియాను అధికంగా వినియోగించడం వల్ల వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని అన్నారు. రీల్స్, షార్ట్స్, గేమ్స్ వంటి వాటిలో ఎక్కువ సమయం గడపడం వలన విలువైన సమయం వృథా అవుతుందని అన్నారు. అయితే మొబైల్‌ను సరైన విధంగా ఉపయోగిస్తే ప్రస్తుత వ్యవహారాలు, ఇంగ్లీష్ నైపుణ్యాలు, వ్యక్తిత్వాభివృద్ధి వంటి అంశాలలో ఉపయోగకరమైన అనేక యాప్స్ ద్వారా ప్రయోజనం పొందవచ్చని సూచించారు. ఇటీవలి కాలంలో ఆన్లైన్ లోన్ మోసాలు, ఫేక్ లింకులు, ఎస్‌ఎంఎస్‌లు, అనుమానాస్పద యాప్స్ ద్వారా సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టి, స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకుని ప్రణాళికతో ముందుకు సాగితే మంచి భవిష్యత్తు సాధించవచ్చని తెలిపారు.కార్యక్రమంలో సీనియర్ మేనేజర్-ఇంటర్నేషనల్ రిలేషన్స్ యు.విజయ లక్ష్మీ, అసిస్టెంట్ డీన్స్- ఫస్ట్ ఇయర్ బి.టెక్ డాక్టర్ కే.చంద్ర మోహన్, డాక్టర్ సుబ్బా రావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :