Friday, 31 July 2026 12:43:00 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మిట్స్ లో ఘనంగా జాతీయ సాంకేతిక దినోత్సవం

Date : 11 May 2026 11:30 PM Views : 117

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 11 : మదనపల్లి సమీపం సమీపంలో అంగళ్ళు వద్ద గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం వారు మిట్స్ ఐ ఐ సి వారి ఆధ్వర్యంలో జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిట్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి మరియు బెంగళూరు కు చెందిన ఖైద్రే సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సి ఈ ఓ ఎమ్.గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాంకేతిక విజ్ఞానం దేశాభివృద్ధికి కీలకమని, యువత సృజనాత్మక ఆలోచనలు మరియు నూతన ఆవిష్కరణల ద్వారా సమాజానికి సేవ చేయాలని తెలిపారు. కృత్రిమ మేధస్సు, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, ఆటోమేషన్, ఆరోగ్య రంగాలలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న విధానాన్ని వివరించారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ఆధునిక సాంకేతిక ధోరణులకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, స్టార్టప్‌లు మరియు పరిశోధనల వైపు ముందడుగు వేయడం చాలా ముఖ్యమని తెలిపారు. యువత కొత్త టెక్నాలజీలపై అవగాహన పెంపొందించుకొని, ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే ప్రపంచస్థాయి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎమ్.శ్రీదేవి, కోఆర్డినేటర్స్ బి.ప్రశాంత్, వి.గీత మరియు విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :