Thursday, 30 July 2026 12:57:21 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు గ్రహీత పారా అథ్లెట్ క్రీడాకారిణి శివానిని సత్కరించిన జిల్లా కలెక్టర్

Date : 26 January 2026 08:25 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 26 : భారత రాష్ట్రపతి గారి చేతులమీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును పొందిన పారా అథ్లెట్ క్రీడాకారిణి శివాని ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఘనంగా సత్కరించారు. జన్మతః కుడి చేయి లేకుండా జన్మించి మదనపల్లి లోని జవహర్ నవోదయ విద్యాలయ సమితి లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని పారా అథ్లెట్ క్రీడాకారిణి కుమారి హెచ్. శివాని ని గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఘనంగా సత్కరించారు. కుమారి శివాని విభిన్న ప్రతిభావంతుల కేటగిరీ షాట్‌పుట్ మరియు జావెలిన్ త్రో పోటీలలో జాతీయ స్థాయి పారా అథ్లెట్ గా, థాయిలాండ్, బెంగళూరు, గుజరాత్ వంటి దేశీయ-అంతర్జాతీయ వేదికలపై పోటీపడి మూడు బంగారు పతకాలు సాధించింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నమయ్య జిల్లా నుండి కుమారి శివానిని రాష్ట్రీయ బాల పురస్కార అవార్డుకు నామినేట్ చేసిన సందర్భంగా 26 డిసెంబర్ 2025 నాడు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును కుమారి శివాని అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుమారి శివానిని విద్యార్థిని విద్యార్థులు అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని, శివాని మరిన్ని బంగారు పథకాలు సాధించాలని తెలిపారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :