Thursday, 30 July 2026 11:56:08 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

ఆర్సిడిఎస్ రాష్ట్ర మహిళా కోఆర్డి నేటర్ పద్మ ప్రియా రెడ్డి

Date : 04 April 2026 05:38 PM Views : 187

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సాటి మనిషికి సహాయ పడటమే మానవత్వం - జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ - ఆర్సిడిఎస్ రాష్ట్ర మహిళా కోఆర్డి నేటర్ పద్మ ప్రియా రెడ్డి మదనపల్లె ఏప్రిల్ 4, ( బి. శ్రీనివాసులు రెడ్డి తరణం ప్రతినిధి ) : సాటి మనిషికి సహాయ పడటమే మానవత్వమని ఆర్సిడిఎస్ రాష్ట్ర మహిళా కోఆర్డి నేటర్ పద్మ ప్రియా రెడ్డి అన్నారు. శనివారం ఆమె పుట్టినరోజు ను పురస్కరించుకొని అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్ సి డి ఎస్ అధ్యక్షులు ఎర్రపురెడ్డి సురేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి బంగారు సుగుణ, ముక్తాపురం సుప్రజా రెడ్డి, డిష్ రెడ్డి కుమారి, మేకల సురేంద్ర, వైఎస్ఆర్సిపి కురబల కోట యూత్ ప్రెసిడెంట్ సుధీర్ రెడ్డి, మదనపల్లి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు సాంబశివరెడ్డి, మాజీ సర్పంచ్ శరత్ రెడ్డి, జడ్పిటిసి నల్లపురెడ్డి రమణారెడ్డి, రెడ్డి సంఘం నాయకులు సుధాకర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి లు హాజ రయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్ వార్డులలో మరియు ఒపీ వద్ద రోగులకు పండ్లు పంపిణి చేయడం జరిగింది. అనంతరం రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్ పద్మ ప్రియ రెడ్డి మాట్లాడుతూ తన పుట్టిన రోజు సందర్బంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోని రోగులకు పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.​తోటి వారికి సహాయం చేయడంలో ఉన్న తృప్తి మరెందులోనూ ఉండదని పేర్కొన్నారు. వివిధ వార్డులను సందర్శించి, చికిత్స పొందుతున్న రోగుల యోగక్షేమాలను అడిగి తెలుసు కున్నారు.ఆర్ సి డి ఎస్ అధ్యక్షులు ఎర్రపురెడ్డి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ​​పద్మప్రియ రెడ్డి సామాజిక సేవా రంగంలో చురుగ్గా ఉంటూ, తన పుట్టిన రోజున ఇలాంటి మంచి కార్య క్రమం చేపట్టడాన్ని అభి నందించారు. ​రోగులకు పండ్లు అందజేస్తున్న సమయంలో ఆమె చూపిన ఆప్యాయత మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. అదే విధంగా ఆర్ సి డి ఎస్ తరపున ఆమె కి జన్మదిన శుభా కాంక్షలు తెలియ జేశారు. ఆమె మరెన్నో జన్మదినోత్స వాలను జరుపుకోవడంతో పాటు భగవంతుడు ఆయురారో గ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :